ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఆన్ కాల్డ్ డ్రైవర్లుగా పనిచేయడానికి ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్ సత్యనారాయణ శనివారం తెలిపారు. దరఖాస్తు చేసేవారికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్, 18 నెలల కనీస డ్రైవర్ అనుభవం ఉండాలన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందిన 25-45 వయసు మధ్య ఉండాలని పేర్కొన్నారు.