ధర్మవరంలోని అర్హులకు బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఐదుగురికి రూ. 2.87 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశామన్నారు. సీఎం సహాయనిధి పేదల పాలిటవరమని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.