ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలుర కళాశాలలో ఈ నెల 5న నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కంటి వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.