ధర్మవరంలోని మహాత్మ కాలనీలో పేరుకుపోయిన చెత్త

52చూసినవారు
ధర్మవరంలోని మహాత్మ కాలనీలో పేరుకుపోయిన చెత్త
ధర్మవరంలోని 26వ వార్డు మహాత్మ కాలనీలో మెయిన్ రోడ్ పరిస్థితి దారుణంగా ఉంది. చెత్త సేకరించే వాహనాలు లేకపోవడంతో ఇళ్ల మధ్యలోని రోడ్లపై స్థానికులు ఇష్టారాజ్యంగా చెత్తను పడేస్తున్నారు. ఈ చెత్త కాస్త కాలువలకు అడ్డుపడి, కాలువల్లో నీరు వెళ్లలేక రోడ్లపై ప్రవహిస్తుంది. దీంతో ఈ ప్రాంతం దోమలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని శనివారం స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్