ముదిగుబ్బ మండల కేంద్రంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని మండల ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఎంపీపీ చెట్లు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మంజులాదేవి, ఈవోఆర్డీ రాజేందర్ కృష్ణ కుమార్, సర్పంచ్ లక్ష్మీదేవి చండ్రాయుడు, బీజేపీ నాయకుడు ఓబిరెడ్డి పాల్గొన్నారు.