ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మకు 'శిల్పగురు' జాతీయ అవార్డుకు ఎంపిక కావడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం విజయవాడలో పేర్కొన్నారు. శివమ్మకు ఈ అవార్డు అందడం తోలు బొమ్మల, రాయలసీమ కళాకారులకు గర్వకారణమని తెలిపారు. శివమ్మ చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు. శివమ్మ లాంటి వారి స్ఫూర్తితో యువత ప్రాచీన కళలను కాపాడుకునేందుకు చొరవ చూపాలని కోరారు.