ధర్మవరం పేట బసవన్న కట్ట వీధిలోని శ్రీ త్రిలింగేశ్వర దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవ శర్మ మాట్లాడుతూ. మాఘమాసం సందర్భంగా శ్రీ ఉమా త్రిలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. ఉదయం గంగా పూజ, గణపతి పూజ, రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.