కళ్యాణదుర్గం: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ

73చూసినవారు
కళ్యాణదుర్గం: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ
కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో శనివారం పోలీసులు ప్రజలతో సమావేశమయ్యారు. సీఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. దొంగతనాలు జరుగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామస్తులను చైతన్యం చేశారు. శక్తి మొబైల్ యాప్ సేవలు, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, చట్టపరమైన చర్యలు, సిసి కెమేరాల ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్