ముదిగుబ్బ మండలంలోని గుడ్డంపల్లి తాండకు చెందిన శివశంకర్ నాయక్ (32) (మూగ, చెవిటి) గతేడాది డిసెంబర్ 24న అదృశ్య మయ్యాడు. కాగా ఛత్తీస్ గడ్ రాష్ట్రం రాయపూర్ జిల్లాకు వెళ్లగా అతణ్ని 'అప్నా ఘర్' సంస్థ ఆశ్రయం కల్పించి బయోమెట్రిక్ ఆధార్ ద్వారా అడ్రస్ కనుక్కొన్నారు. ముదిగుబ్బ పోలీసుల సహకారంతో మంగళవారం స్వగ్రామానికి పంపించారు.