ధర్మవరం మండలం చిన్నూరు, బత్తలపల్లికి చెందిన మాజీ సర్పంచ్లు వెంకటరాముడు, పున్నమరాజు తమ అనుచరులతో కలిసి మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ నేత హరీశ్ బాబు కాషాయ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ ఆశయాలు, మంత్రి సత్యకుమార్ యాదవ్ పట్టణంలో చేస్తున్న అభివృద్ధిని చూసి వారు బీజేపీలో చేరారని హరీశ్ తెలిపారు.