ముదిగుబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అధికారులు ప్రారంభించారు. మండల విద్యాధికారి రమణప్ప, సీఐ శివరాముడు, ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గోపాల్, క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమ్మల మనోహర్ నాయుడు కూటమి నాయకులు గుర్రం జయచంద్ర పాల్గొన్నారు. సుమారు 60 మంది జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించారు.