ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నిర్మించనున్న రోడ్లు, కాలువలు, ప్రభుత్వ స్థలాలకు కంచె నిర్మాణ పనులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు కోసం ప్రభుత్వం రూ. 3. 35 కోట్లు కేటాయించిందని, పనులు నాణ్యతతో, త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.