ధర్మవరం పట్టణంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ రేపు (శనివారం) పర్యటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉ. 10.00 గంటలకు ఇందిరమ్మ కాలనీలో రూ. 3.30 కోట్ల వ్యయంతో రోడ్లు, కాలువలు, రిజర్వ్ స్థలాలకు కంచె నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ముదిగుబ్బలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.