అన్నదాతలు తీసుకున్న రుణాలకు వడ్డీ కట్టించుకుని రెన్యువల్ చేసుకోవాలని సీపీఐ నాయకులు బ్యాంక్ అధికారులకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. రుణాలు పొందిన రైతులు అసలు, వడ్డీ చెల్లించాలని అధికారులు పెట్టిన షరతులు విరమించుకోవాలని అన్నారు. తీవ్రకరువు మండలమైన ముదుగుబ్బ బ్యాంకుల్లో వడ్డీ మాత్రమే కట్టించుకుని రెన్యువల్ చేయాలని ఎస్బీఐ ముందు ధర్నా చేశారు.