శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ ఇంజినీరింగ్ సెక్షన్ కార్మికులు ఆదివారం మస్టర్ పాయింట్ వద్ద సీఐటీయూ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు జీతాల పెంపు, ప్రభుత్వ పథకాల అమలుకు డిమాండ్ చేస్తూ సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బొగ్గు నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, కార్యవర్గ సభ్యులు దస్తగిరి, శివయ్య, నాగరాజు పాల్గొన్నారు.