ధర్మవరం పట్టణంలోని ఏమర్వో కార్యాలయం ఎదురుగా శనివారం సాయంత్రం ధర్మవరం పట్టణ ముస్లింలు అందరూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు రద్దు చేసేంతవరకు నిరసనలు చేస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సిపిఐ కార్యదర్శి అమీర్ భాష పాల్గొన్నారు