బ్రిటిష్ వారిని గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతిని ముదిగుబ్బ తహశీల్దార్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ నారాయణస్వామి మాట్లాడుతూ.. వడ్డే ఓబన్న స్వాతంత్రానికి పూర్వం చేపట్టిన పోరాట పటిమను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు పాల్గొన్నారు.