ధర్మవరంలో విద్యుత్ మరమ్మతుల కారణంగా సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ నాగభూషణం గురువారం తెలిపారు. ప్రియాంక నగర్, ఎర్రగుంట సర్కిల్, ఎస్ఐసి ఆఫీస్ ప్రాంతాల్లో, పార్థసారథి నగర్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.