ధర్మవరం బ్రాహ్మణ వీధిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై పట్టణ పుర వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయం ఇన్ చార్జ్ హరీశ్ బాబు, ఆలయం కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.