పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంత్రి సవితా తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమము లో వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు సుబ్బరాయుడు, ఆర్డీవో సువర్ణ, టిడిపి నాయకులు పాల్గొన్నారు.