శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నూతన కమిటీని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నియమించారు. జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా ధర్మవరానికి చెందిన మాసపల్లి సాయికుమార్ నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.