ధర్మవరంలో ఎస్పీ రత్న ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, కళాశాల బాలికలు హెల్మెట్ ధరించి మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలన్నారు. పట్టణంలోని పోతుకుంట, కాలేజ్ సర్కిల్, పీఆర్టీ స్ట్రీట్, గాంధీనగర్, పలు వీధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ హేమంత్ కుమార్, వన్ టౌన్, టూ టౌన్ సీఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.