ధర్మవరం పట్టణం 26వ వార్డు లక్ష్మీ చెన్నకేశవపురంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా, భక్తులు సంతోషంతో స్వీకరించారు.