ధర్మవరంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అమ్మవారికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. తొలుత అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు, వివిధ అభిషేకాలను నిర్వహించారు. అమ్మవారిని తొలుత వివిధ పూల మాలలతో, వివిధ ఆభరణాలతో అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. తదుపరి అమ్మవారిని ఓ ప్రత్యేకమైన పల్లకిలో ఉంచి ఆలయ ఆవరణలో ఊరేగింపు నిర్వహించారు.