ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామపంచాయతీలో శనివారం నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మన ఇళ్ల ముందు మన గ్రామాలలో శుభ్రత పాటిస్తూ ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించాలని అందరి భాగస్వామ్యంతో మాత్రమే ప్లాస్టిక్ ని శుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ను నిర్మించగలమని అన్నారు.