తాడిమర్రి మండలం చిల్లకొండయ్య పల్లి గ్రామంలో శనివారం ఓ రైతు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చిల్లకొండయ్య పల్లి చెందిన చిగిచెర్ల చిన్నారాయన (70) ఆవులు మేపడానికి పొలానికి తీసుకెళ్లాడు. సాయంత్రం రైతు తన కుమారుడు గురు ప్రసాద్ కు ఫోన్ చేసి ఆవు దూడ కనిపించడం లేదని తెలిపాడు. గురు ప్రసాద్ ఆవు దూడను వెతుకుతూ నీటి గుంత వద్దకు వెళ్లగా అక్కడ తన తండ్రి చిన్నారాయణ ఆవు దూడ నీటిలో విగత జీవులై కనిపించారు.