ధర్మవరంలో 23వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త నాగరత్నమ్మ సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు ముత్తుకూరు బీబీ, పట్టణ అధ్యక్షురాలు స్వర్ణకుమారి, టీడీపీ మహిళలు మృతురాలు నాగరత్నమ్మకు నివాళులర్పించారు. ముత్తుకూరు బీబీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త నాగరత్నమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు.