ధర్మవరంలోని సాయి నగర్ చెందిన ఖలందర్ (41) అనే టీడీపీ కార్యకర్త బుధవారం మృతి చెందాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బత్తలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపై టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.