ముదిగుబ్బలోని ఎస్సీ కాలనీకి చెందిన నారాయణస్వామి కుమారుడు శివ ప్రసాద్(45) గురువారం అర్ధరాత్రి తన ఇంట్లో ఉరేసుకున్నాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు.