ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని బుధవారం గ్రామస్థులు కనుగొన్నారు. రైల్వే ట్రాక్ సమీపంలో సుమారు 35 ఏళ్ల వయసున్న పురుషుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.