ధర్మవరంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం

55చూసినవారు
ధర్మవరంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమం
ధర్మవరం పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న చిత్రపటాన్ని ఉంచి భారీ పూలమాల వేసి కేక్ కట్ చేశారు. జై వడ్డెర జై జై వడ్డెర అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం అధ్యక్షుడు డేరంగుల అంజి, తోపుదుర్తి వెంకటరాముడు, పల్లపు బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్