దశాబ్దాలుగా వడ్డీపేటలో నెలకొన్న నీటి సమస్య తీర్చమని ఆప్రాంత మహిళలు క్లస్టర్ ఇన్ చార్జ్ తుమ్మల మనోహర్ దృష్టికి తీసుకురాగా గురువారం రాత్రి వేయించిన బోరులో నీరు పుష్కలంగా పడ్డాయి. దీంతో వడ్డీపేట ప్రజలకు నీటి కష్టాలు తీరినట్లేనని ఆయన తెలిపారు. ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్, మంత్రి సత్య కుమార్ దృష్టికి తీసుకెళ్లి అధికారులతో నీటి సమస్య తీర్చేందుకు కృషిచేసినందుకు మనోహర్కు ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.