ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి జేవీ రమణ, కార్మిక సంఘం నాయకులు బాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.