విద్యుత్ రైలు ప్రారంభమై మంగళవారం నాటికి 100 సంవత్సరాల పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని విద్యుత్ రైలుకు వందనం కార్యక్రమాన్ని గుత్తి రైల్వే డీజిల్ షెడ్ అధికారులు, కార్మికులు ఘనంగా నిర్వహించారు. గుత్తి రైల్వే డీజిల్ షెడ్ వద్ద నుంచి అంబేడ్కర్ పార్క్ మీదుగా రైల్వే ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. సీనియర్ డీఎంఈ ప్రమోద్ మాట్లాడారు. ఫిబ్రవరి 3, 1925లో మొదటి విద్యుత్ రైలు ప్రారంభమైందన్నారు.