అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలి

79చూసినవారు
అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలి
దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లా అనంతపురం కావడంతో, ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని, అలాగే ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించే అవకాశం కల్పించాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. కేంద్ర భారత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుని శుక్రవారం ఎంపీల బృందంతో కలిసి, అనంతపురం జిల్లాకు సంబంధించిన కీలక సమస్యలను వివరించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్