గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం అనంతపురం జిల్లా జడ్జి శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు, వేద పండితులు జిల్లా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేసి అర్పించారు.