అనంత: రూ.15 కోట్ల సర్కారు స్థలం కబ్జా

3చూసినవారు
అనంత: రూ.15 కోట్ల సర్కారు స్థలం కబ్జా
గత వైసీపీ పాలనలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు నేతల దాహానికి గురయ్యాయి. గుంతకల్లులో హనుమాన్ సర్కిల్ వద్ద వైసీపీ నేత దేవేంద్రప్ప తన స్థలంలో పెట్రోల్ బంకు పెట్టాడు. పక్కనే ఉన్న సర్వే నం. 424-Bలో 23 సెంట్లు, 421-2లో 31 సెంట్ల ప్రభుత్వ భూమిని కుటుంబ సభ్యుల పేర్లపై నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించాడు. అక్కడ షెడ్లు, 17 దుకాణాలు నిర్మించి అద్దెకు ఇచ్చాడు. ఈ భూమి విలువ రూ.15 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్