గుత్తిలోని జెండా వీధి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, స్కూటీ ఢీకొన్నాయి. ప్రమాదంలో నారాయణ, జయమ్మ గాయపడ్డారు. వన్డేదొడ్డికి చెందిన నారాయణ బైక్లో బస్టాండ్ వైపు వెళుతుండగా జెండా వీధి వద్ద రోడ్డును క్రాస్ చేస్తున్న స్కూటీని ఢీకొన్నాడు. ప్రమాదంలో బైక్ ను డ్రైవ్ చేస్తున్న నారాయణ, స్కూటీని డ్రైవ్ చేస్తున్న జయమ్మ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.