గుత్తి గాంధీ చౌక్ వద్ద శనివారం బీజేపీ నాయకులు బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేశారు. బీజేపీ జిల్లా నాయకులు తెగదొడ్డి తిమ్మారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలలో విజయం సాధించిందని తెలిపారు. భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై, జై మోదీ అంటూ నినాదాలు చేశారు.