అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వ్యాపారస్తులు ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ తో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగిస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.