గుత్తిలోని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ

58చూసినవారు
గుత్తిలోని తురకపల్లి రోడ్డులో ఉన్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి తిప్పయ్య ఇంటిలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు స్థానికులు తెలిపారు. బీరువాలో ఉన్న వస్తువులను చిందర వందరగా పడేసి, కొంత నగదుతో వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారన్నారు. ఇంటి యజమాని అందుబాటులో లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్