అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని జడ్ వీరారెడ్డి కాలనీలో గురువారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులతో పాటు సీపీఎం నాయకులు పలుసార్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాలనీవాసులతో మాట్లాడారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు సక్రమంగా లేవని కాలనీవాసులు విన్నవించారు. సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.