గుంతకల్లు మండలంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వైటీ చెరువులో డెలివరీ ట్యాంక్ మోటార్ ఆన్ చేస్తుండగా యువకుడు శివ ప్రమాదవశాత్తు విద్యుత్ షాకుకు గురయ్యాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.