పామిడి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో గురువారం రాత్రి ఐచర్ వాహనం చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో చెట్టుకొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగల మీద పడి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి విద్యుత్ తీగలకు మరమ్మతులు చేపట్టారు.