పామిడి పట్టణం లోని అత్యంత పురాతన శ్రీ అనంత, గజ, గరుడ, లక్ష్మీ నారాయణ స్వామి వారికీ తొలి ఏకాదశి సందర్బంగా విశేష పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల అభిషేకం, ప్రత్యేక పుష్ప అలంకరణ భక్తులచే విష్ణు సహస్ర పారాయణం చదివారు. అనంతరం శ్రీదేవి, భూదేవి, స్వామి వారి ఉత్సవ విగ్రహాలు పల్లకిలో ఉంచి ప్రాకరోత్సవం చేశారు. భక్తి గీతాలు ఆలపించారు. మంగళ హారతి గావించి తీర్థ ప్రసాదాలు అందించారు