గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో శనివారం పల్లె పండగ పంచాయతీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శనివారం గుంతకల్లు టీడీపీ మండల ఇన్ ఛార్జ్ నారాయణస్వామి, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు మణికంఠ హాజరయ్యారు. అనంతరం గ్రామంలో మినీ గోకులం షెడ్లతో పాటు, సీసీ రోడ్లు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పల్లె ప్రగతికి బాటలు వేస్తూ పాడి రైతులకు బాసటగా నిలుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.