అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సీఎస్ఐ టౌన్ చర్చ్ ఫాస్టర్ రెవరెండ్ సాల్మన్ బాబు ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ భక్తులు ఈ మట్టలను చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం టౌన్ చర్చి చుట్టూ తిరిగారు. అనంతరం చర్చిలో మట్టలను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసు ప్రభువును ఆహ్వానిస్తూ ప్రార్థనలు చేశారు.