గుమ్మలకుంట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

68చూసినవారు
గుమ్మలకుంట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని మంగంపల్లి సమీపన 44వ నెంబరు జాతీయ రహదారి పై శనివారం కారు బోల్తా పడి మహిళ మృతి చెందింది. బత్తలపల్లి మండలం గుమ్మలకుంటకు చెందిన పవన్ కుమార్ రెడ్డి, మహేశ్వరి(32) హైదారాబాద్ లో ఉంటున్నారు. తమ్ముడి వివాహానికి ఏడాదిన్నర కుమారుడు వియాన్స్, మరిది అమర్నాథ్ కలిసి కారులో వస్తుండగా మంగంపల్లి వద్ద కుక్క అడ్డురావడంతో బోల్తా పడింది. తన ఒడిలో ఉన్న కుమారుడిని అదిమి పట్టుకుని ప్రాణాలు కాపాడి తాను మృతి చెందింది.

సంబంధిత పోస్ట్