ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి డిమాండ్ చేశారు. శనివారం గుంతకల్లులోని హంపి రెడ్డి భవనంలో సీఐటీయు అనుబంధ ఆశా వర్కర్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పీహెచ్ సీలో కొంతమంది ఆశా వర్కర్లకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.