గుంతకల్లులో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టీవో రాజాబాబు, వన్ టౌన్ సీఐ మనోహర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ లు తప్పనిసరిగా డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఆటో డ్రైవర్లకు తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.